Packaged drinking water: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘‘హై రిస్క్ ఫుడ్ కేటగిరీ’’లో చేర్చింది. ఇలా వర్గీకరించడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించిన తర్వాత ఈ యాక్షన్ తీసుకున్నారు.
Read Also: Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
కొత్త నియమం ప్రకారం.. అన్ని ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్ తయారీదారులు ఇప్పుడు ప్రతీ ఏడాది, అత్యున్నత తనిఖీలకు గురికావాల్సి ఉంటుంది. లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ మంజూరు చేయడానికి ముందు ఈ తనిఖీలు జరుగుతాయి. హై-రిస్క్ కేటగిరి కిందకు వచ్చే ఉత్పత్తుల కోసం కఠినమైన భద్రతా చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
FSSAI యొక్క ఆర్డర్ ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌తో సహా అధిక-రిస్క్ ఫుడ్ కేటగిరీలలోని వ్యాపారాలు FSSAIచే గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఆహార భద్రతా ఏజెన్సీల ద్వారా వార్షిక ఆడిట్‌లను ఎదుర్కోవాలి. వినియోగదారుల కోసం ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం దీని ఉద్దేశ్యం. గతంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS, FSSAI రెండింటి నుండి ద్వంద్వ ధృవీకరణ అవసరాన్ని తొలగించాలని కోరాయి, సరళీకృత నిబంధనలకు పిలుపునిచ్చాయి. కొత్త నిబంధనలు పర్మిషన్ల ప్రక్రియను క్రమబద్దీకరించడానికి, తయారీదారులపై భారాన్ని తగ్గించడానికి సాయపడుతాయని నిపుణులు భావిస్తున్నారు.