ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినిమా తరహాలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అనంతరం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మీరట్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ప్రియుడితో కలిసి భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్‌తో పూడ్చేసిన సంఘటన జ్ఞాపకం వస్తుంది. అలాంటి మీరట్‌లో తాజాగా స్నేహితుడు ఆదిల్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపి చంపేశాడు. ఛాతీపై వరుసగా మూడు బుల్లెట్లు దిగినట్లుగా వీడియోలో కనిపించింది. వీడియోలో వదలండి అంటూ ఒక వాయిస్ వినిపించింది. అనంతరం నిందితుడు బైక్‌పై పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సహచరుడు మొబైల్‌లో రికార్డ్ చేశాడు. 11 సెకన్లలోపు ఉన్న ఈ వీడియోను నిందితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మీరట్‌లో శాంతి భద్రతలు కరవయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!
ప్రస్తుతం వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆదిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడా? లేదంటే చనిపోయాడా? అని నిర్ధారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మీరట్‌లో భయాందోళనలు సృష్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇక బాధిత ఆదిల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు నిందితుల పేర్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో కో-సింగర్ అమృత్‌ప్రవ అరెస్ట్.. ఆమె ఫోన్‌లో ఏముందంటే..!
అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది. వీడియోను వైరల్ చేయడానికి ఇలా చేశారా? లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు మీరట్ పోలీసులు తెలిపారు. పోలీసులకు బహిరంగ సవాల్ విసిరేందుకు ఇలా చేసి ఉంటారేమోనని భావిస్తున్నారు.
