NTV Telugu Site icon

Emmanuel Macron: యూపీఐతో “టీ” డబ్బులు చెల్లించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్.. వీడియో..

Pm Modi, .

Pm Modi, .

Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్. గురువారం ఆయన భారతదేశానికి వచ్చారు. రాజస్థాన్ జైపూర్ సిటీని సందర్శించారు. జైపూర్ నగరంలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ, అధ్యక్షుడు మక్రాన్‌కి స్వాగతం పలికారు, ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చిన మక్రాన్ రెండు రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. తొలిరోజు జైపూర్ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభమైంది.

Read Also: President Murmu: “భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి”.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ డే సందేశం..

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ, అధ్యక్షుడు మక్రాన్ ఇరువురు జైపూర్ నగరంలోని టీస్టాల్ వద్ద సాధారణ వ్యక్తుల్లా టీ తాగారు. అనంతరం మక్రాన్ యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీ యూపీఐ విధానం గురించి మక్రాన్‌కి వివరించారు.

అంతకుముందు ప్రత్యేక విమానంలో మక్రాన్ జైపూర్‌కి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, విదేశాంగ మంత్రి ఎస్ జైశకంర్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ స్వాగతం పలికారు. అనంతరం మక్రాన్ కాన్వాయ్ విమానాశ్రయం నుంచి అమెర్ కోటకు వెళ్లారు. మార్గం మధ్యలో పాఠశాల విద్యార్థులు అధ్యక్షుడు మక్రాన్‌కి అభివాదం చేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని మోడీ, అధ్యక్షుడు మక్రాన్ కలిసి రోడ్ షో నిర్వహించారు. మక్రాన్ రెండు రోజుల పర్యటనలో భారత్-ఫ్రాన్స్ మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.