Site icon NTV Telugu

రాఖీపండుగ స్పెషల్‌ : బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్‌ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్‌ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

Exit mobile version