Site icon NTV Telugu

కేంద్రం కీల‌క నిర్ణ‌యంః వ‌చ్చేనెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు…

క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  గ‌తంలో క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో రేష‌న్‌ను ఉచితంగా అందించిన సంగ‌తి తెలిసిందే.  మే, జూన్ నెల‌ల‌కు కూడా కేంద్రం ఉచితంగా రేష‌న్‌ను అందించింది. కాగా, ఈ రేష‌న్ మ‌రో 5 నెల‌ల‌పాటు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.  జులై నెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఉచిత రేష‌న్‌ను అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  

Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్!

బియ్యం రేష‌న్ కార్డు ఉన్న‌వారికి ఇంట్లో ఒక్కొక్క‌రికి 5 కేజీల చొప్పున బియ్యం అందించాల‌ని నిన్న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.  సెకండ్ వేవ్ మ‌హ‌మ్మారి ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో పాటుగా, మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  

Exit mobile version