Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు. కరీంనగర్ కు చెందిన బాధిత అర్ర మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ తో 420, 120-B IPC కింద సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ 95 కోట్ల రూపాయలు టోకరా పెట్టిన నిందితుడు రమేశ్ ను అరెస్ట్ చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన..
అయితే, కుర్రిమాల రమేష్ గౌడ్ స్వస్థలం జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వాడు. రమేష్ గౌడ్ ఒక కొత్త వెబ్ సైట్ క్రీయేట్ చేసి అధిక పెట్టుబడులతో లాభాలు అంటూ చాలా కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేశాడు. మనోష్ ఫిర్యాదుతో నిందితుడు రమేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సీఐడీ పోలీసులు.