NTV Telugu Site icon

UNSC: భారత్కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఫ్రాన్స్‌

France

France

UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్‌ సపోర్ట్ ఇచ్చింది. శక్తిమంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొనింది. న్యూయార్క్‌లో బుధవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం భద్రతామండలి స్తంభించిపోయింది.. దాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Reasi Bus Terror Attack : రియాసి బస్సుపై దాడి కేసులో అనేక చోట్ల ఎన్ఐఏ దాడులు

కాగా, ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లను భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలుగా చేర్చుకోవాలి అని డిమాండ్ చేశారు. వాటితో పాటు రెండు ఆఫ్రికా దేశాలనూ కూడా తీసుకోవాలి అన్నారు. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలని ఆయన చెప్పారు. భద్రతామండలి పని తీరు కూడా మారాలని.. కొన్ని అంశాల్లో వీటో అధికారంపై పరిమితులు ఉండాలని ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.