Site icon NTV Telugu

Mumbai: ఓ మాతృమూర్తి నిర్లక్ష్యం.. 12వ అంతస్తు నుంచి జారి పడి చిన్నారి మృతి

Mumbai

Mumbai

నిర్లక్ష్యం.. ఓ చిన్నారి ప్రాణాలు బలిగొన్నాయి. మాతృమూర్తి కళ్ల ముందే ముక్కుపచ్చలారని పసిబిడ్డ ప్రాణాలు పోయాయి. ఈ ఘోర విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ప్రతిపక్షం షాకింగ్ నిర్ణయం.. ధన్‌ఖర్‌కు వీడ్కోలు విందు ఏర్పాటు!

ముంబైలోని నైగావ్‌లోని నవ్‌కేర్ సిటీలో భారీ భవంతులో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. నాలుగేళ్ల చిన్నారి అన్వికా ప్రజాపతితో కలిసి తల్లి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది. చిన్నారిని షూ అల్మారాపైన కూర్చోబెట్టింది. ఇంతలో అన్వికా కిటికీ గుమ్మం ఎక్కే ప్రయత్నించింది. కానీ బాలికకు ప్రమాదం అని తెలియక గోడ అంచువరకు వచ్చేసింది. తల్లి చూసేలోపే చిన్నారి 12వ అంతస్తు నుంచి జారి పడింది. దీంతో ఒక్కసారిగా తల్లి కంగారు పడి సమీపంలో ఉన్నవారిని అలర్ట్ చేసింది. హుటాహుటినా వాసాయి వెస్ట్‌లోని సర్ డిఎం పెటిట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి మరణించినట్లుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తల్లి విలవిలలాడిపోయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. నిందితురాలిపై కొత్త పిటిషన్!

Exit mobile version