NTV Telugu Site icon

Kerala: విషాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

Kerala

Kerala

కేరళలో విషాదం చోటుచేసుకుంది. షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతిచెందారు. శనివారం తిరువనంతపురం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు సహా నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షోరనూర్ వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఉన్న చెత్తను తొలగిస్తున్న సమయంలో న్యూఢిల్లీ-తిరువనంతపురం రైలు మధ్యాహ్నం 3.05 గంటలకు కార్మికులను ఢీకొట్టినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అధికారులు సంఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే కార్మికులు.. రైలును గమనించి ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే తదుపరి విచారణ జరుగుతోందని షోరనూర్ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా..నాలుగో వ్యక్తి మృతదేహం నదిలో పడిపోయింది. దాన్ని వెలికితీసేందుకు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Tirupati Crime: లాడ్జిలో మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్

 

Show comments