NTV Telugu Site icon

Bomb Threat: నోయిడాలో నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Bomb

Bomb

Bomb Threat: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 5) ఉదయం నాలుగు ప్రైవేట్‌ స్కూల్స్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు స్టూడెంట్స్ ను బయటకు పంపించి.. నోయిడా పోలీసులకు సమాచారం అందించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, అగ్నిమాపక దళంతో ఆయా పాఠశాలలకు చేరుకుని.. క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ దొరకలేదని తేల్చి చెప్పారు. ఈ బెదిరింపులు అంతా బూటకమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also: YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?

ఈ బాంబు బెదిరింపుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్‌ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టెప్‌ బై స్టెప్‌ స్కూల్‌, ది హెరిటేజ్‌ స్కూల్‌ నోయిడా, జ్ఞానశ్రీ స్కూల్‌, మయూర్‌ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు రావడంతో తాము వెళ్లి తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మెయిల్‌ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.