Site icon NTV Telugu

UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి

Uptrain

Uptrain

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. మీర్జాపూర్‌లోని చునార్ జంక్షన్‌లో చోపాన్-ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రయాణికులు ఫ్లాట్‌ఫామ్‌పై దిగకుండా పట్టాలపై దిగారు. అనంతరం పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తుండగా హౌరా-కల్కా నేతాజీ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. వేగంగా రైలు దూసుకు రావడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ

బాధితులు ప్లాట్‌ఫామ్ వైపు దిగకుండా పట్టాలు దిగడమే ప్రమాదానికి కారణం అని అధికారులు తెలిపారు. ఇక ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ.. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

Exit mobile version