NTV Telugu Site icon

Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి

Tamil Nadu Bomb Blast

Tamil Nadu Bomb Blast

Four killed in bomb blast in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో బాంబు పేలుడు జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూరులో ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలోొ ఇంట్లో నాటు బాంబులు తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పేలుడు ధాటకి పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.

Read Also: Hospital Negligence: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి

అర్థరాత్రి ఇంట్లో ఫైర్ వర్క్ చేస్తుండగా పేలుడు సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు. పేలుడుతో సమీప ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాంబుల పేలుళ్లతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

తమిళనాడులో ఇలాంటి ఘటనలు తరుచుగా చూస్తుంటాం. ముఖ్యంగా బాణాసంచాకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఉన్న శివకాశిలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుని కూలీలు మరణిస్తుంటారు. తాజాగా నమక్కల్ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది.