NTV Telugu Site icon

Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో నలుగురు మృతి.. ఉత్తరాఖండ్‌లో ప్రమాదం

Uttarakhand

Uttarakhand

Uttarakhand: బండరాళ్లు వాహనాలపై పడటంతో వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు డీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఉత్తరాఖండ్‌లో బండరాళ్లు పడిపోవడంతో వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి వద్ద ప్రయాణీకులు యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భారీ వర్షం కారణంగా కొండలపై నుంచి రాళ్లు పడిపోవడంతో మూడు వాహనాలు ధ్వంసమైన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

Read also: RaaiLaxmi : హాట్ యాంగిల్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో హీటేక్కిస్తున్న హాట్ బ్యూటీ..

సోమవారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి వద్ద యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో మూడు వాహనాలు కొండ పక్కనే ఉన్న రోడ్డుపై వెళుతుండగా బండరాళ్లు దొర్లుతూ వచ్చి వాహనాలపై పడ్డాయి. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవారని తెలిసింది.ధ్వంసమైన వాహనాల అవశేషాలు ప్రమాద స్థాయిని తెలియజేస్తున్నాయి. చిన్న బస్సు ఒకవైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మరో రెండు చిన్న వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

Read also: Cruel Father: ఛీ వీడు అసలు తండ్రేనా? భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను చంపి..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర భారత రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్ తాజాగా చేరింది. భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతోపాటు వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని పాఠశాలలు వాతావరణం మెరుగుపడే వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో, వర్ష సంబంధిత సంఘటనలలో 30 మంది మరణించారు. వంతెనలు కొట్టుకుపోతున్న దృశ్యాలు మరియు వాహనాలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు రాష్ట్రంలో వర్షపు విధ్వంసం యొక్క స్థాయికి అద్ధం పడుతున్నాయి.

Show comments