Site icon NTV Telugu

Tamil Nadu: టీవీకే గూటికి అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్.. విజయ్ సమక్షంలో చేరిక

Tvkvijay

Tvkvijay

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు, అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్ టీవీకే గూటికి చేరారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. సెంగోట్టయన్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులతో తరలివచ్చిన సెంగోట్టయన్.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో చేరారు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

సెంగోట్టయన్ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోబిచెట్టిపాళయం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పార్టీ నుంచి బహిష్కరించారు.

వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం డీఎంకే పోరాడుతుంటే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అన్నాడీఎంకే కూటమి భావిస్తోంది. మరోవైపు కొత్తగా పార్టీ స్థాపించిన హీరో విజయ్ కూడా టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇలా మూడు పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి.

 

Exit mobile version