Site icon NTV Telugu

Selvam: మాజీ ఎమ్మెల్యేకు సెగ.. మళ్లీ సొంత గూటికి..

తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్‌ లైట్స్‌ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.. దీంతో.. వెంటనే డీఎంకే అధిష్ఠానం సెల్వంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. నియోజకవర్గంలోనూ తీవ్ర నిరసన జరిగాయి.. తమిళనాడు గత అసెంబ్లీలో డీఎంకే అసమ్మతి నేతగా అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే, ఇప్పుడు ఆ నేత మళ్లీ మనసు మార్చుకున్నారు.. డీఎంకే పార్టీలో తిరిగి చేఆరు.. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు సెల్వం.

Read Also: Gold Price: పసిడి పైపైకి.. రూ.51 వేలు దాటేసి..

పార్టీ ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో స్టాలిన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మరియు ఇతర సీనియర్ నేతల సమక్షంలో సెల్వం డీఎంకేలో చేరారు. డీఎంకే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2016-21లో థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో, అతను డీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శి మరియు కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కూడా పనిచేశారు.. ఆయన రెండు దశాబ్దాలకు పైగా డీఎంకేలో ఉన్నారు.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు 2020 ఆగస్టు 13న డీఎంకే బహిష్కరించగా.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.

Exit mobile version