NTV Telugu Site icon

Student Open Fire: స్కూల్లో తూపాకితో మాజీ విద్యార్థి కలకలం.. మూడు సార్లు కాల్పులు..

Student Open Fire

Student Open Fire

Kerala Student Open Fire in School: పాఠశాలలో తూపాకితో మాజీ విద్యార్థి కలకలం సృష్టించాడు. ఎయిర్‌ పిస్టల్‌తో స్కూల్‌కు వచ్చి బెదిరింపులు దిగిన మాజీ విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌ జిల్లాలో వివేకోదయం బాయ్స్‌ హయ్యర్ సెకండరీ స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. త్రిసూర్‌లోని వివేకోదయం మాజీ విద్యార్థి జగన్‌ మంగళవారంఉదయం 10 గంటల సమయంలో పాఠశాలలోకి ప్రవేశించాడు. నేరుగా స్టాఫ్‌ రూంకు వెళ్లిన జగన్‌ తనతో పాటు తెచ్చుకున్న ఎయిర్‌ పిస్టల్‌ను జెబులో నుంచి తీసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులను బెదిరించాడు. దీంతో టీచర్లంతా ఉలిక్కిపడ్డారు.

Also Read: Israel-Hamas War: హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్.. 24 గంటల్లో 250 టార్గెట్‌లపై బాంబుల వర్షం..

ఆ తర్వాత పక్కనే ఉన్న క్లాస్‌ రూంకి వెళ్లి స్టూడెంట్స్‌కు గన్‌ చూపించి బెదరించాడు. అంతేకాదు మూడు గాల్లో కాల్పులు కూడా జరిపినట్టు విద్యార్థులు, టీచర్లు తెలిపారు. ఆ తర్వాత జగన్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, విద్యార్థులంతా సేఫ్‌ ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా నిందితుడు డ్రగ్స్‌ బానిసయ్యాడని, మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే జగన్‌ పాఠశాలకు ఎందుకు వచ్చాడు, అతడికి గన్‌ ఎక్కడిదనే దానిపై విచారిస్తున్నట్టు త్రిసూర్‌ క్రైం బ్రాంచ్‌ ఏసీపీ మీడియా తెలిపారు.

Also Read: Nirmala Sitharaman: తెలంగాణను కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చింది..