జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ విజయం సాధించారు. సెరైకెలా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి గణేష్ మహాలీపై చంపై 20,447 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Erra Cheera: తొలి తొలి ముద్దు సాంగ్ రీల్స్, షార్ట్ కాంటెస్ట్.. వీడియో పంపు లక్ష కొట్టు!
జనవరిలో మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జేఎంఎం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో చంపై సోరెన్ హఠాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చంపై అలకబూనినట్లుగా తెలుస్తోంది. హేమంత్ సోరెన్.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే చంపై.. జేఎంఎం పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో సెరైకెలా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ మరోసారి విజయం సాధించింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 57 స్థానాలు జేఎంఎం కూటమి గెలుచుకుంది. ఇక ముఖ్యమంత్రి హేమంత్, ఆయన భార్య కల్పన కూడా విజయం సాధించారు. హేమంత్ జైలుకు వెళ్లొచ్చి.. ఘనవిజయాన్ని అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra Election Results: ఇక మహారాష్ట్రలో అదానీ ప్రాజెక్టుకు ఉపశమనం?.. ఏంటా ప్రాజెక్ట్?