జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ విజయం సాధించారు. సెరైకెలా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి గణేష్ మహాలీపై చంపై 20,447 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
జార్ఖండ్‌లోని ప్రముఖ తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో సెరైకెలా కోర్టు తీర్పు వెలువరించింది. తబ్రేజ్‌ను కొట్టి చంపిన మొత్తం 10 మంది దోషులకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.