Site icon NTV Telugu

Jharkhand: శిబు సోరెన్‌కు నివాళులర్పిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన చంపై సోరెన్

Champai Soren

Champai Soren

జేఎంఎం వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ భౌతికకాయానికి బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంపై సోరెన్ ఎక్కి ఎక్కి ఏడ్చారు. శిబు సోరెన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో మరణించారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, తదితర నేతలంతా శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక రాంచీలో శిబు సోరెన్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివస్తున్నారు. కడసారి చూసేందుకు బారులు తీరారు. ఆయన చిత్రపటానికి నివాళుల్పిస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రం శిబు సోరెన్ స్వస్థలమైన నిమ్రాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

శిబు సోరెన్..
శిబు సోరెన్.. సీనియర్ పొలిటీషియన్. దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. 2005లో 10 రోజుల పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2008 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2010 వరకు ఇలా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇక మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

1944, జనవరి 11న శిబు సోరెన్ జన్మించారు. భార్య పేరు రూపి సోరెన్. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. హేమంత్ సోరెన్, దుర్గా సోరెన్, బసంత్ సోరెన్, కుమార్తె అంజలీ సోరెన్ సంతానం. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 1995 నుంచి 2005 వరకు జామా నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ జామ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. బసంత్ సోరెన్ జార్ఖండ్ యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తూ దుమ్కా నుంచి 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

Exit mobile version