NTV Telugu Site icon

BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కి షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..

Bjp Aap

Bjp Aap

BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్‌బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్‌దేవా ఆయనను ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా నియమించారు.తాను ఎమ్మెల్యేగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించానని, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదని దలాల్ ఆరోపించారు. ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, ఆప్ తన అవినీతి నిరోధక హామీలకు దూరంగా ఉందని ఆరోపించారు.

Read Also: Jaya Bachchan: లోక్‌సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య

ఆప్ క్రీడా యూనివర్సిటీ గురించి తప్పుడు హామీలు ఇచ్చిందని సచ్‌దేవా విమర్శించారు. కాగితంపై నియామకాలు జరిగాయని, నిధులు పంపిణీ చేయబడ్డాయని, కానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా, తన హయాంలోనే పూర్తి చేసేలా చూస్తోందని చెప్పారు.

ఢిల్లీలోని పంజాబీ, గ్రామీణ వర్గాల్లో బల్బీర్ సింగ్, సుఖ్‌బీర్ దలాల్‌కి మంచి పేరుందని సచ్‌దేవా ప్రశంసించారు. కేంద్రమంత్రి మల్హోత్రా మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఒకప్పుడు పార్టీ అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని వదిలేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని, అందుకు ఆప్ నుంచి పలువురు నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

Show comments