Site icon NTV Telugu

Viral Video: రోడ్డు దాటుతున్న పులులు.. నిలిచిపోయిన ట్రాఫిక్..

Tiger Crossing Road

Tiger Crossing Road

Forest Official Stops Commuters To Let Tigers Cross Road In Maharashtra: పులులు రోడ్డు దాటేందుకు అటవీ అధికారి రోడ్డుపై ప్రయాణికుల వాహనాలను ఆపేశారు. ఈ ఘటన మహరాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పటి వరకు 1300 వ్యూస్ దక్కించుకుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను మిలింద్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Read Also: Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..

పులులు ప్రశాంతంగా రోడ్డు దాటేందుకు అటవీ అధికారి ఇరువైపు వాహనాలను ఆపేశారు. ప్రయాణికులను ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఓ పెద్ద పులి చెట్ల వెనకనుంచి రోడ్డును క్రాస్ చేయడం కనిపిస్తుంది. దాని వెనకాలే మరో పులిపిల్ల అనుసరిస్తుంటుంది. ప్రయాణికులు ప్రశాంతంగా, మౌనంగా ఉండాలని అధికారులు కోరడం ఇందులో కనిపిస్తుంది.

మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లా పరిధిలో తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఉంది. తరుచుగా ఈ ప్రాంతంలో పులులు ప్రమాదాలకు గురువుతున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఆరు పులులు చనిపోయాయి. వన్యప్రాణుల వేట, రోడ్డు ప్రమాదాలకు గురై పులులు చనిపోతున్నాయి. ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల ఈ ప్రాంతంలో మనుషులు మృత్యువాత పడుతున్నారు. పులులు-మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్(ఎన్జీటీ) 2019లో మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.

Exit mobile version