NTV Telugu Site icon

Kerala: విదేశీ మహిళకు పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వివాదాస్పదమైన ఘటన..

Kerala

Kerala

Kerala: కేరళలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలోకి ఒక విదేశీ మహిళను రానివ్వకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జాతీయతను సాకుగా చూపించి ఆమెను ఆలయ ప్రవేశం నిరాకరించారు. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, తాను హిందూ మాతాన్ని స్వీకరించానని చెప్పినప్పటికీ ఆమెను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం స్పందించారు. ‘‘ఎవరినైనా, తాము పూజించకుండా ఎందుకు నిరోధించాలి..?’’ అని ప్రశ్నించారు.

హర్‌ప్రీత్ అనే నెటిజన్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. పూర్తిగా సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఉన్న విదేశీ మహిళను ఆలయంలోకి అనుమతించలేదని వీడియోలో పేర్కొన్నారు. ఈ ఆలయంలోకి భారతీయులకు మాత్రమే అనుమతి ఉందని చెప్పి, ఆమెను గుడిలోకి అనుమతిచంలేదు. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నారని, తమకు నిశ్చితార్థం అయిందని, త్వరలోనే తాను భారతీయురాలిగా మారుతానని చెప్పనప్పటికీ, అధికారులు ఆమెను ఆలయ కార్యాలయానికి పంపారు. అక్కడి అధికారులు మాట్లాడుతూ, ఈ ఆలయంలోకి భారతీయులకు మాత్రమే ప్రవేశం ఉందని చెప్పారు.

Read Also: Supreme Court: దారుణం..చేయని నేరానికి 11 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి..

ఈ వీడియోలో మహిళ తాను హిందువు అని చెప్పారు. అయితే, ఆలయ అధికారులు మాత్రం అందుకు సర్టిఫికేట్ సమర్పించాలని కోరారు. దీనికి ఆమె అన్ని వేళల సర్టిఫికేట్ తీసుకుని వెళ్లారా..? అని ప్రశ్నించడం వీడియోలో కనిపించింది. ఇది న్యాయమైన చర్య కాదని, తాను భారతయుడిని వివాహం చేసుకోబోతున్నానని, భగవద్గీతన చదివానని, అయినప్పటికీ సెక్యూరిటీ తనను నేరస్తురాలిగా చూశారని పేర్కొన్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు తాను చీరను ధరించానని చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింబది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందించారు. కొందరు మహిళ వాదనను సమర్థించగా, మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని కామెంట్స్ చేశారు.

‘‘మతం మరియు జాతీయతతో సంబంధం లేకుండా ఎవరైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించబడాలి. వారు దుస్తులు కోడ్, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతు మాత్రమే ఉండాలి’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దేవుడిని పూజించేందుకు వెళ్లిన ఈ జంటను అడ్డుకోవడం విచారకమని మరొకరు అన్నారు. ‘‘దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు కావు. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయం అనుమతించేది’’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు.