NTV Telugu Site icon

Mamata Benerjee: దుర్గాపూజ కోసం పూజా కమిటీలకు రూ. 60 వేల గ్రాంట్

Mamata Benerjee

Mamata Benerjee

Mamata Benerjee: రాష్ట్రంలో దుర్గాపూజ నిర్వహణ కమిటీల గ్రాంట్‌ను రూ.50,000 నుంచి రూ.60,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సీఎం బెనర్జీ సెలవులు కూడా ప్రకటించారు. గతేడాది దుర్గాపూజ కమిటీలకు రూ.50వేలు ఆర్థిక సాయం అందిందని, ఈ ఏడాది కమిటీలకు రూ.60వేలు అందజేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. పూజా కమిటీలు ఇచ్చే విద్యుత్ ఛార్జీలపై రాయితీని ప్రస్తుతం 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతామని ఆమె తెలిపారు.కమ్యూనిటీ దుర్గాపూజ నిర్వాహకులతో జరిగిన సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. కమ్యూనిటీ దుర్గా పూజ క్లబ్‌లకు డబ్బు ఇవ్వాలని 2018లో టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. బెంగాల్‌లో దుర్గాపూజ వేడుకలు తరచుగా రాజకీయ సమస్యగా మారాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా వేడుకలు అంత సందడిగా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు.

Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక

ప్రారంభం రోజైన సెప్టెంబర్‌ 1న కోల్‌కతాలో భారీ ర్యాలీ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దుర్గా పూజకు వారసత్వ ట్యాగ్‌ని అందించిన యునెస్కోకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రంగుల మయం చేయాలని, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పూజా కమిటీలు, ప్రజలకు పిలుపునిచ్చారు. యునెస్కో సభ్యులతోపాటు విదేశీ ప్రతినిధుల బృందాలు కూడా కోల్‌కతాను సందర్శిస్తాయని అన్నారు. భారీ ర్యాలీతో ప్రారంభమయ్యే దుర్గా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 8న మెగా కార్నివాల్‌తో ముగుస్తాయని వివరించారు.