Site icon NTV Telugu

Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్‌కు లగ్జరీ వాచ్ బహుమతి.. ఖరీదు ఎన్ని కోట్లుంటే..!

Lionel Messi

Lionel Messi

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో పర్యటించారు. చివరిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూడా పర్యటించారు. అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శంగా మెస్సీకి అనంత్ అంబానీ ప్రత్యేక కానుక అందించారు. రిచర్డ్ మిల్లె లగ్జరీ వాచ్‌ను బహుకరించాడు. దాదాపు దీని ఖరీదు రూ.11 కోట్లు ఉంటుందని అంచనా.

ఈ రిచర్డ్ మిల్లె గడియారం ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వాచ్‌లో ఒకటి. ఈ వాచ్ అత్యంత ప్రత్యేకమైంది. RM 003-V2 GMT అనేది రిచర్డ్ మిల్లె మోడళ్లలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. వంతారా సందర్శనకు వచ్చినప్పుడు మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేదు. తిరిగి వెళ్లిపోతుండగా చేతికి RM 003-V2 వాచ్ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గడియారంలో అత్యంత అద్భుతమైన లక్షణాలుంటాయి.

ఈ ప్రత్యేకమైన రిచర్డ్ మిల్లె టైమ్‌పీస్ ప్రస్తుతం బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా, ఫార్ములా 1 డ్రైవర్ మిక్ షూమేకర్, మాజీ ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు, ఫెరారీ జట్టు ప్రిన్సిపాల్ జీన్ టాడ్డ్ వంటి ప్రముఖులు ధరిస్తున్నారు. అలాగే జోహోర్ క్రౌన్ ప్రిన్స్ తుంకు ఇస్మాయిల్ ఇబ్ని సుల్తాన్ ఇబ్రహీం, వాచ్‌మేకర్ కరి వౌటిలైనెన్ కూడా ధరిస్తున్నారు. ఇప్పుడు అంత ఖరీదైన వాచ్‌ను మెస్సీ ధరించాడు.

ఇక పర్యటన ముగించుకుని వెళ్తుండగా భారత ప్రజల ప్రేమ, ఆప్యాయతకు మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నమస్తే ఇండియా! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాకు ఎంత అద్భుతమైన సందర్శనలు. నా పర్యటన అంతటా ఆత్మీయ స్వాగతం. గొప్ప ఆతిథ్యం, ప్రేమకు ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను!’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version