Site icon NTV Telugu

Food-for-Oil Deal: ఫుడ్ ఫర్ ఆయిల్.. పుతిన్- మోడీ మధ్య కీలక డీల్!

Modi

Modi

Food-for-Oil Deal: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాసేపటి (డిసెంబర్ 4న) క్రితం ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యారు. అతడ్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్ కు ఫ్రెండ్ గా భావించే పుతిన్ కోసం ప్రధాని మోడీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి నేరుగా మాస్కో అధినేత దగ్గరకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఓకే కారులో బయల్దేరారు. కాసేపట్లో ప్రధాన మంత్రి మోడీ నివాసంలో విందులో పాల్గొననున్నారు.

Read Also: Andhra Pradesh: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 56,278 కొత్త ఉద్యోగాలు..!

అయితే, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో నుంచి ఆయిల్ ను ఇండియా అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. ఈ డీల్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనలో ఒప్పందం చేసుకోనున్నారు. ఇందులో ముఖ్యంగా ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్ $60 బిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను క్రెమ్లిన్ కు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్ ను భారత్ కి పంపనుంది.

Exit mobile version