Site icon NTV Telugu

Train Accident: రైల్లో నుంచి జారిపడి ఐదుగురు మృతి

Mumbai

Mumbai

Train Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్‌ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్‌ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ సంఘటన సమయంలో, పుష్పక్ ఎక్స్‌ప్రెస్- కసారా ​​లోకల్ ఒకదానికొకటి దాటుతున్నాయి.

Read Also: Mudragada Padmanabha Reddy: మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.. బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ..!

అయితే, అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు రైలు డోర్స్‌ దగ్గర వేలాడుతూ ప్రయాణిస్తున్నారు అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పది నుంచి 12 మంది ప్రయాణికులు జారి పట్టాలపై పడ్డారు.. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంత మందికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక, ముంబైలో విప‌రీత‌మైన ర‌ద్దీతో లోక‌ల్ ట్రైన్లో ప్రయాణికులు ఫుట్ బోర్డింగ్‌లో ప్రయాణించడం అక్కడ సర్వసాధారణం.

Exit mobile version