Five Family Members Died In Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొట్టుకున్నాయి. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక పురుషుడు ఉన్నారు. కడలూరు జిల్లా వేప్పుర్ దగ్గర చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్‌ను వెంబడించి, కత్తితో పొడిచి..
చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. దక్షిణాది జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో.. ఇక్కడ రాత్రిపూట కూడా రద్దీ ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన ఒక కారుని.. వేగంగా వచ్చిన ఓ ఇసుకలారీ ఢీకొట్టింది. ఆ కారు ఎదురుగా నిల్చున్న లారీని ఢీకొట్టి, రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయ్యింది. ఈ కారులో ఉన్నవారే మృతి చెందారు. ఈ యాక్సిడెంట్ కారణంగానే ఇతర వాహనాలు ఢీకొట్టేసుకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందించగా.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Instagram Job Fraud: ఆన్‌లైన్ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా
లారీల మధ్య కారు నుజ్జునుజ్జై మృతిచెందిన ఐదుగురి మృతదేహాలను బయటకు తీసేందుకు.. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించారు. కారులో లభ్యమైన ఆర్‌సీ బుక్‌తో.. మృతిచెందిన వారు కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మదురైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన రసీదు కూడా కారులో లభ్యమైంది. ఈ ప్రమాదం కారణంగా.. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.