Site icon NTV Telugu

Bihar Elctions: రేపే బీహార్ తొలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది

Bihar

Bihar

బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Zohran Mamdani: జవహర్‌లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ గురువారం (06-11-2025) 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో దశ 11-11-2025న జరగనుంది. రెండో విడతలో 122 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Story Board: బీహార్‌లో ఏ కూటమి గట్టెక్కేనో..?

ఇక రెండో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ఆదివారం ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రులు, బీజేపీ మంత్రులు, ఇక కాంగ్రెస్ అగ్ర నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Exit mobile version