ఢిల్లీ రోహిణి కోర్టు హల్ లో జరిగిన “గ్యాంగ్ వార్” లో మొత్తం నలుగురు మరణించారు. “మోస్ట్ వాంటెడ్” గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడి కి పాల్పడిన టిల్లు గ్యాంగ్ కు చెందిన దుండగులపై ఢిల్లీ “స్పెషల్ సెల్” సాయుధ పోలీసులు కాల్పులు జరిపడంతో వారిలో ముగ్గురు మరణించారు. ఈరోజు మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్ 2 హాలులోనే ఈ కాల్పులు జరిగాయి. న్యాయవాదుల వేషధారణలో ఉన్న టిల్లు గ్యాంగ్ కు చెందిన దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ రెండు గ్యాంగుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం ఉంది. గ్యాంగ్ స్టర్ గోగి తో సహా దాడికి పాల్పడిన ముగ్గురు మృతి చెందగా… మరో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహటిన ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ : “గ్యాంగ్ వార్” లో నలుగురు మృతి
