Site icon NTV Telugu

Ravi Shankar Prasad: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం

Ravi Shankar Prasad

Ravi Shankar Prasad

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కేంద్రమంత్రి ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం.

ఇది కూడా చదవండి: Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర విషాదం.. ట్రైన్‌పై క్రేన్ పడి 22 మంది మృతి

ఢిల్లీలోని మదర్ థెరిసా క్రెసెంట్ మార్గ్‌లో రవిశంకర్ ప్రసాద్ అధికారిక నివాసం ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. అగ్నిప్రమాదం గురించి ఫోన్ కాల్ వచ్చిందని.. సంఘటనాస్థలిలో ఒక గదిలోని ఫర్నీచర్ నుంచి మంటలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే ఇంట్లో కేంద్రమంత్రి ఉన్నారా? లేదా అనే విషయం తెలియదని స్పష్టం చేశారు. మూడు అగ్నిమాపక వాహనాలు వెళ్లి మంటలు అదుపు చేసినట్లుగా చెప్పారు. ఉదయం 8:35 గంటలకు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు.

ఇది కూడా చదవండి: India-US: వాణిజ్య ఒప్పందంపై శుభవార్త.. జైశంకర్ కీలక ట్వీట్

Exit mobile version