Site icon NTV Telugu

Fire Accident in Train: షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..

Shalimar Express

Shalimar Express

Fire in Shalimar Express train near Maharashtra’s Nasik: అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. రైలు మహారాష్ట్రలోని నాసిక్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అధికారులు మంటలను గుర్తించారు. రైలు ఇంజిన్ పక్కన ఉన్న పార్సిల్ కోచ్ లో ముందుగా మంటలు చెలరేగాయి. ఘటన తెలిసిన వెంటనే అధికారులు, ఫైర్ ఫైటర్స్ సంఘటన స్థలానికి చేరారు. పార్సిల్ కోచ్ లో చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఉదయం 8.43 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Twitter: ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో షాక్.. ఈ 3 ఫీచర్ల కోసం ఛార్జీలు చెల్లించాలి..!

అయితే అధికారులు సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర బోగీలకు అంటుకోలేదు. పార్సిల్ బోగిలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక వేళ ప్యాసింజర్ బోగీలో మంటలు చెలరేగితే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు. మంటలు ఆర్పేసేందుకు పార్సిల్ కోచ్ ను, రైలు నుంచి విడదీశామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన బోగీని తొలగించి రైలును పంపించారు.

 

Exit mobile version