Site icon NTV Telugu

Mumbai: ముంబైలో అర్ధరాత్రి 10వ అంతస్థులో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Mumbaifire

Mumbaifire

దీపావళి రోజున నవీ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది గాయాల పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నిక.. ఊహించని మెజారిటీతో గెలుపు

నవీ ముంబైలోని వాషి ప్రాంతంలో రహేజా రెసిడెన్సీలోని 10వ అంతస్థులోని ఒక ఫ్లాట్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమక్రమంగా 11వ, 12వ అంతస్థులకు కూడా వేగంగా వ్యాపించాయి. ఓ వైపు దీపావళి వేడుకలు.. ఇంకోవైపు అగ్నిప్రమాదంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వాషిలోని రెండు ఆస్పత్రుల తరలించారు. మృతులు కేరళ వాసులుగా అనుమానిస్తున్నారు. మృతులు సుందర్ బాలకృష్ణన్(44), పూజా రాజన్ (39), కమల్ హిరాల్ జైన్(84), ఆరేళ్ల బాలిక ఉన్నారు.

ఇది కూడా చదవండి: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్‌ లీవిట్‌

సమాచారం అందిన వెంటనే 40 మంది అగ్నిమాపక సిబ్బంది.. 8 అగ్నిమాపక శకటాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారని అధికారి తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్ హెచ్చరిక

Exit mobile version