Gujarat: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు

  • సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం
  • టెక్స్‌టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు
  • మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Surat Fire

Surat Fire

గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నట్లు సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపారు. సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం గిడ్డంగి పనులు జరుగుతున్నాయని.. అలాగే లోపల చాలా సామాగ్రి ఉందని తెలిపారు. 100-125 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!