Site icon NTV Telugu

Mumbai: చెంబూర్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Firemumbai

Firemumbai

మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొగ సమీప ప్రాంతాలను కమ్మేసింది.

 

https://twitter.com/PTI_News/status/1847605193816277075

Exit mobile version