Site icon NTV Telugu

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళ సజీవదహనం

Fire Accident

Fire Accident

Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలోని ఓ భవనంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read: Congress: కాంగ్రెస్ అభ్యర్థికి చెప్పు చూపించి మరీ వార్నింగ్..

అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఒక చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ప్రమాద సమయంలో భవనంలో 60 మంది ఉన్నారని, మంటలు చెలరేగడంతో చాలా మంది భవనంపై నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని అధికారులు తెలిపారు.

Also Read: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్‌ ఘటన.. మూడో రోజు కూడా కొనసాగతున్న సహాయక చర్యలు

Exit mobile version