FIR filed in Lucknow for morphing CM Yogi’s image in place of Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘ పఠాన్ ’ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’పాట మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే బికినీపై, కొన్ని పదాలు, అశ్లీలతపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసభ్యకరమైన సన్నివేశాలు తొలిగిస్తేనే సినిమాకు అనుమతి ఇస్తామని, లేకపోతే నిషేధిస్తామని ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాటు బీహార్ తో పాటు పలుచోట్ల సినిమాపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇక బీజేపీ నేతలు కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. హిందూ సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు కూడా సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇస్లాంను తప్పుగా చూపిస్తున్నారంటూ మండిపడుతున్నాయి.
https://twitter.com/SaurabhSMUP/status/1604411943237713925
Read Also: Minister Mallareddy: కేసీఆర్ ప్రధాని కావాలి.. జోగులాంబను కోరుకున్నా!
ఇదిలా ఉంటే మరో వివాదంలోకి పఠాన్ సినిమా చేరింది. ఈ సినిమాలో బికినీలో ఉన్న దీపికా పదుకొణెను షారూఖ్ ఖాన్ పట్టుకేనే సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ లో దీపికా ప్లేస్ ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోతో మార్ఫింగ్ చేశారు. ఈ ఫోటోను అజార్ ఎస్ఆర్కే అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/SaffronSwamy/status/1604162000753332224
దీనిపై యూపీ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్నో సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 295ఏ, ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి రానుంది పఠాన్ సినిమా.
