Site icon NTV Telugu

Budget Halwa: “బడ్జెట్ హల్వా” కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్.. అసలు ఈ హల్వా ప్రాముఖ్యత ఏంటి..?

Budget Halwa

Budget Halwa

Budget Halwa: మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో సాంప్రదాయ ‘హల్వా వేడుక’ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నార్గ్ బ్లాక్‌లోని కేంద్రం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ఉన్నారు.

బడ్జెట్ ప్రక్రియ ముగింపు, ముద్రణకు ముందు ఇలా హల్వా వేడుకలను సాంప్రదాయకంగా నిర్వహిస్తారు. రాబోయే బడ్జెట్ గోప్యత పాటించేందుకు, పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు బడ్జెట్ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులంతా ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉండాలి.

Read Also: Saudi Arabia: తొలి “లిక్కర్ షాప్” ప్రారంభించనున్న సౌదీ అరేబియా.. కానీ, కండిషన్స్ అప్లై..

హల్వా వేడుక: దీని ప్రాముఖ్యత ఏంటి..?

ఈ ఆచారం దశాబ్ధాలుగా ఉంది. ముఖ్యంగా భారతీయలు ఏదైనా వేడుకకు ముందు ఇలా స్వీట్లు పంచుకోవడం అనేది సంప్రదాయంగా ఉంది. శుభవార్తలకు నోరు తీపి చేసుకోవాలని చెబుతుంటారు. బడ్జెట్ కూడా అలాంటి వేడుక వంటిదే అని చెప్పేందుకు ఇలా హల్వా వేడకల్ని నిర్వహిస్తారు. భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆచరించే ఒక సంప్రదాయం. ఇది దేశ బడ్జెట్ చివరి దశను సూచిస్తుంది. కేంద్రం పార్లమెంట్‌కి బడ్జెట్ సమర్పించే కొన్ని రోజుల ముందు ఈ వేడుకలు జరుగుతాయి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.

అధికారికంగా బడ్జెట్ ముద్రణ ప్రారంభమవుతుంది. ఇది బడ్జెట్ ‘లాక్-ఇన్’ దశను సూచిస్తుంది. బడ్జెట్ తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్న వారంతా, బడ్జెట్ సమర్పించే వకు కుటుంబానికి, ఇతరులతో సంబంధం లేకుండా మంత్రిత్వ కార్యాలయ ఆవరణలోనే ఉంటారు. ఈ ప్రక్రియ ప్రారంభాన్ని హల్వా వేడుకలు సూచిస్తాయి.

Exit mobile version