NTV Telugu Site icon

BJP: కాంగ్రెస్ హయాంలో సిక్కుల ఊచకోత మరిచావా..? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Rahul Gandhi

Rahul Gandhi

BJP: అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ‘‘సిక్కులు భారతదేశంలో తలపాగా ధరించడానికి, గురుద్వారాని సందర్శించడానికి అనుమతించబోతున్నారా లేదా అనేదానిపై పోరాటం’’ అంటూ వ్యాక్యలు చేశారు. వర్జీనియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ…‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించాడానికి అనుమతిస్తున్నారా..? లేదా అనే దానిపై పోరాటం జరుగుతోంది. భారతదేశంలో సిక్కులు కడాను ధరించడానికి, గురుద్వారా వెళ్లడానికి అనుమతించబడుతున్నారా లేదా?? ఇది కేవలం సిక్కులకే కాదు, అన్ని మతాలకు సంబంధించింనది’’ అంటూ వ్యాఖ్యాలు చేశారు.

ఇదే కాకుండా.. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోడీ పట్ల ఉన్న భయం తొలిగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చింది. ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. వివిధ ఏజెన్సీలు, మీడియా, ఆదాయపు పన్ను శాఖలు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలలో కూడా భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాయి. కానీ, ఏమీ పని చేయలేదు. అందరిలో భయం మాయమైంది.’’ అని అన్నారు. మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోయిందని, భయం వ్యాప్తి చెందడానికి ఏళ్లు పట్టింది, చాలా డబ్బు వినియోగించింది, కానీ ఇప్పుదని అదృ‌శ్యమైందని అన్నారు. 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందని ఇప్పుడు చెప్పగలనని రాహుల్ గాంధీ అన్నారు.

Read Also: CM relief fund: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరివిగా విరాళాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశంలో పరిస్థితిని వక్రీకరించాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని, విదేశాల్లో దేశాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నాడంటూ బీజేపీ మండిపడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో సిక్కులను చంపేసిందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించే వారు మూడోసారి ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

బీజేపీ నేత ఆర్పీ సింగ్ కూడా గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఢిల్లీలో మూడు వేల మంది సిక్కుల్ని ఊచకోత కోశారు. వారి తలపాగాలను విప్పారు. జుట్టు కత్తిరించారు. గడ్డం గీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా జ రిగిందని ఆయన చెప్పడం లేదు. రాహుల్ గాంధీ భారతదేశంలో ఇది పునరావృతం చేయాలని సవాల్ చేస్తూ, అతను సిక్కుల గురించి ఏం మాట్లాడుతున్నాడు..? అతడిపై కేసు వేసి కోర్టుకి లాగుతా అని హెచ్చరించారు. విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నాడని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, బాధ్యతాయుతంగా మాట్లాడాలని, అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రోజూ కూడా విదేశాల్లో దేశాన్ని విమర్శించలేదని గుర్తు చేశారు.

Show comments