Mumbai: ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులను రక్షించి మరోక బోటులోకి తీసుకువస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పడవ సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతుండటం వీడియోలో చూడవచ్చు.
Read Also: India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
నీల్‌కమల్ అనే పడవ ఎలిఫెంటాకు వెళ్తూ ఉరాన్, కరంజా దగ్గర మునిగిపోవడం ప్రారంభించింది. ఓడలో దాదాపుగా 30-35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. నేవీ, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్‌పిఎ), కోస్ట్ గార్డ్, ఎల్లో గేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో సహా స్థానిక మత్య్సకారులు మూడు బృందాలుగా ప్రయాణికుల్ని రక్షిస్తు్న్నారు. కొస్ట్ గార్డ్ చాలా మంది ప్రాణాలను రక్షించింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.