2022 మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకు చెందిన 21 ఏళ్ల సినిశెట్టి గెలుచుకుంది. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటైన గ్రాండ్ ఫైనల్స్‌లో నిర్వాహకులు సినిశెట్టిని విజేతగా ప్రకటించారు. 58వ ఫెమీనా మిస్ ఇండియాగా టైటిల్ కైవసం చేసుకున్న సినిశెట్టి స్వరాష్ట్రం కర్ణాటకనే అయినా పుట్టి పెరిగింది ముంబైలోనే. ఆమె అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తున్నారు. సినిశెట్టి భారతనాట్య కళాకారిణి కూడా కావడం విశేషం.
Read Also: ఈ వారం బెస్ట్ లుక్.. సాంప్రదాయ దుస్తుల్లో ముద్దుగుమ్మలు
కాగా ఫెమీన్ మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సినట చౌహాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మిస్ తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. అటు ఐదో స్థానంలో గార్గీ నందీ నిలిచారు. కాగా ఇప్పటివరకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా ఛిబ్, నఫీసా జోసెఫ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందినవారే. ఇప్పుడిదే జాబితాలో సినిశెట్టి కూడా చేరడం గమనార్హం.