Site icon NTV Telugu

Vijay: టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు ముస్లింలు షాక్.. ఫత్వా జారీ

Vijay

Vijay

తమిళనాడులో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఇరాకటంలో పడ్డారు. ఆయన తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. రంజాన్ మాసంలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుపై సున్నీ ముస్లిం మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Devineni Avinash: అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం!

ఫత్వాలో ముస్లిం సమాజం విజయ్‌ను నమ్మొద్దని కోరారు. తన సినిమాలైన ‘కత్తి’, ‘బీస్ట్’ చిత్రాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ అవతారం ఎత్తి ముస్లింలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చూస్తున్నారని.. ముస్లింలు ఎవరూ ఆయనతో ఉండొద్దని హెచ్చరించారు. ఇక ఇఫ్తార్ విందుకు రౌడీలను, ముస్లింలు కానీ వారిని పిలిచారని.. ఎప్పుడూ ఉపవాసం ఉండని వారిని విందుకు పిలిచారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది.

విజయ్‌కు ఫత్వా ఇవ్వడంపై తమిళనాడు ముస్లిం లీగ్ తప్పుపట్టింది. విజయ్‌పై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. డీఎంకే, దాని మిత్రపక్షాలు.. టీవీకేలో చీలిక సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Crime News: ఆస్తి కోసం ఏకంగా మొత్తం కుటుంబాన్నే హత్య చేసందుకు సుఫారీ

Exit mobile version