Site icon NTV Telugu

Shocking: ఇదేం ప్రేమ.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్..

Love Affair

Love Affair

Shocking: మధ్యప్రదేశ్‌‌లో షాకింగ్ సంఘటన జరిగింది. అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది పోయి, వారి పేరెంట్స్ లేచిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి, తన కూతురుకు కాబోయే అత్తగారితో లేచిపోయాడు. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరు కలిసి పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది. పిల్లల నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో 8 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. గురువారం పోలీసులు పారిపోయిన మహిళను కనుగొన్నారు.

ఉంట్వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ వారం రోజులుగా కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు. ఆమె కుమారుడు మిస్సింగ్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం, పోలీసులు ఆమెను చిక్లి గ్రామంలో కనుగొన్నారు. ఆమె 50 ఏళ్ల రైతుతో కలిసి జీవిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే పోలీసులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ వ్యక్తి మహిళ కొడుకుకు కాబోయే భార్యకు తండ్రి అని తేలింది.

Read Also: Amazon: 14,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది ఇందుకే.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్..

చిక్లికి చెందిన వ్యక్తి కొంత కాలం క్రితం తన భార్యను కోల్పోయాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అతని కుమార్తెకు కొన్ని రోజుల క్రితం సదరు మహిళ కొడుకుతో వివాహం చేయాలని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ కోసం అన్ని సన్నాహాలు చేస్తున్న సమయంలో.. వరుడి తల్లి, వధువు తండ్రి ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ సంఘటనపై పోలీస్ అధికారి అశోక్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘8 రోజుల క్రితం 45 ఏళ్ల మహిళ కనిపించడం లేదని ఫిర్యాదు వచ్చింది. ఆమె తన భర్త, 18,20 ఏళ్ల ఇద్దరు పిల్ల్లని వదిలి 50 ఏళ్ల రైతుతో పారిపోయిందని మా దర్యాప్తులో తేలింది. అతడి కుమార్తెకు, ఆమె కుమారుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. నిశ్చితార్థం ఇంకా జరగలేదు. వారిద్దరూ కలిసి జీవించాలని అనుకుంటున్నారు. ఆ మహిళ తన ప్రేమికుడిని విడిచిపెట్టడానికి నిరాకరించింది. అతడితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె రావడానికి ఒప్పుకోలేదు’’ చెప్పారు.

Exit mobile version