Site icon NTV Telugu

Madyapradesh: కొడుకు పెళ్లి కోసం కులం మారిన తండ్రి..!

Marriage

Marriage

Madyapradesh: కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు. ఈ కథలో విచిత్రం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం యువకుడి తండ్రి కూడా ప్రేమ కోసం హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారాడు.

Read Also: Mahindra’s Armado: ఆర్మీ కోసం మహీంద్రా “ఆర్మడో”.. బండి మామూలుగా లేదుగా..!

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిచ్లీలో నివసిస్తున్న ఫాజిల్(23) అనే యువకుడు అమ్‌గావ్‌కు చెందిన సోనాలితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇద్దరూ కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని కోర్టులో వివాహం చేసేకునేందుకు కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇరువురి మతాల బేధాల కారణంగా అందుకు నిరాకరించారు. మరోవైపు ఈ ప్రేమ వ్యవహారం నగరం మొత్తం వ్యాపించి కొందరు నిరసనకు దిగారు. అంతేకాకుండా ప్రేమ జంట దరఖాస్తును ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది వైరల్ అయింది. దీంతో అక్కడి ప్రజలు మరింత రెచ్చిపోయారు.

Read Also: Gutha Sukender Reddy: ఎండలో నడిచి ఆరోగ్యం పాడుచేసుకొకండి.. భట్టి కి గుత్తా సుఖేందర్‌ సూచన

అంతేకాకుండా ఆ ప్రేమజంట వివాహం కోసమని ఇద్దరు సాక్ష్యులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిపై సంతాప సభ నిర్వహించాలని ప్రకటన వెలువడింది. అయినా అదేమీ పట్టించుకోకుండా ప్రేమ జంట తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. ఒకరి నుండి ఒకరు విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. యువకుడు ఫాజిల్ తనకు తెలిసిన వారితో కలిసి జిల్లాకు చెందిన బీజేపీ యువమోర్చా సభ్యులను సంప్రదించాడు. తిరిగి హిందూమతంలోకి వస్తానంటూ చెప్పాడు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రియాంక్ జైన్ ప్రేమజంట సమాచారాన్ని సేకరించారు. అప్పుడు ఫాజిల్ తండ్రి ఒక హిందువు అని తెలిసింది. తన తండ్రి కూడా ప్రేమ వ్యవహారం కారణంగా పురాన్ మెహ్రాకు చెందిన షేక్ అబ్దుల్ అయ్యాడు. ఇందువల్ల ప్రేమజంట పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరాలు ఏమీ లేకపోవడంతో వారు పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version