FASTag Annual Pass: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న FASTag వార్షిక పాస్ ధర.. ఎంతంటే..
- పెరుగనున్న FASTag వార్షిక పాస్ ధర..
- ఏప్రిల్ 1 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FASTag Annual Pass: దేశంలో నేషనల్ హైవేలపై ప్రయాణించే ప్రయాణికులకు ఒక ముఖ్య సమాచారం, ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరుగనున్నాయి. జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను సులభతరం చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్(FASTag) వార్షిక పాస్ పథకం ఇప్పుడు కాస్త ప్రియం కానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పాస్ ధరలో స్వల్ప పెంపును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం, ఏప్రిల్ 1 నుండి, ప్రైవేట్ వాహనాల ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను రూ.3,075కు పెంచారు. ఇంతకుముందు, ఈ ధర రూ.3,000గా ఉండేది. ఈ పాస్ ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది.
Also Read
- LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
FASTag వార్షిక పాస్ ఏమిటి.?
రహదారులపై పదే పదే టోల్ చెల్లించాల్సిన ఇబ్బందిని తొలగించడం, డిజిటల్ పద్ధతిలో టోల్ వసూళ్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. FASTag కలిగిన ఏ ప్రైవేట్ వాహనమైనా ఈ పాస్‌ను కొనుగోలు చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, ఈ వార్షిక పాస్ ఒక సంవత్సరం పాటు లేదా గరిష్టంగా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది, ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అంతవరకు ఇది వర్తిస్తుంది.
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా వాహన యజమానులు FASTag వార్షిక పాస్‌ను వినియోగిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జాతీయ రహదారులపై ప్రైవేట్ కార్లకు సంబంధించిన మొత్తం టోల్ లావాదేవీలలో సుమారు 28 శాతం ఇప్పుడు ఈ వార్షిక పాస్ ద్వారానే జరుగుతున్నాయి. నేషనల్ హైవేలపై తరుచుగా ప్రయాణించే వ్యక్తులు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు.
భారతదేశంలో FASTag విధానం తొలిసారిగా 2016లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు మారు 118.6 మిలియన్ల FASTags జారీ చేయబడ్డాయి. వీటిలో, సుమారు 59 మిలియన్ల FASTags ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ద్వారా వచ్చే ఆదాయంలో 98 శాతానికి పైగా వీటి ద్వారానే వసూలు అవుతుంది.
FASTag వార్షిక పాస్‌ను ఎలా కొనాలి.?
మీరు జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించేవారై ఉండి, ఇంకా FASTag వార్షిక పాస్‌ను లేకుంటే, మీరు దీనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ల ద్వారా గానీ, లేదా ‘Rajmarg Yatra’ మొబైల్ అప్లికేషన్ ద్వారా గానీ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న పాస్‌లను కూడా ఇదే పద్ధతులను ఉపయోగించి పునరుద్ధరించుకోవచ్చు.
వినియోగదారులు తమ FASTagకు లింక్ అయిన అకౌంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తదుపరి, వారు వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత UPI, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే, ఆ పాస్ నేరుగా FASTagకు లింక్ అవుతుంది. సాధారణంగా 24 గంటలలోపు యాక్టీవ్ అవుతుంది. ఆ తర్వాత, వాహన యజమాని ఒక సంవత్సరం పాటు లేదా గరిష్టంగా 200 టోల్ ప్రయాణాల వరకు దీని ప్రయోజనాలను పొందవచ్చు.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!