NTV Telugu Site icon

Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు

Abdul Sattar On Farmers

Abdul Sattar On Farmers

Farmers Suicide Not New Says Maharashtra Agriculture Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదని, కొన్నేళ్లుగా ఈ ఘటనలు జరుగుతున్నాయని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఔరంగాబాద్ జిల్లాలోని సిలోద్ నియోజకవర్గంలో.. రైతు ఆత్మహత్యలకు మీడియా ప్రశ్నించినప్పుడు, ఈమేరకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘రైతు ఆత్మహత్యల సమస్య అనేది కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. నా నియోజకవర్గంతో పాటు మొత్తం మహారాష్ట్రలో ఎక్కడా రైతుల ఆత్మహత్యలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Lufthansa Turbulence: విమానంలో కుదుపులు.. 37 వేల నుంచి 4 వేల అడుగులకి ఢమాల్

ఇదిలావుండగా.. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం మార్చి 3 నుంచి 12వ తేదీ మధ్య సిలోద్‌లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే.. మొత్తం ఆరుగురు రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతు ఆత్మహత్యలపై మీడియా వాళ్లు ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. అంతేకాదు.. రైతు ఆత్మహత్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గత వారంలో భారీ వర్షాలు పడటంతో తీవ్ర పంట నష్టం వాటిల్లగా.. దాన్ని పరిశీలించేందుకు మంత్రి ఆదివారం పర్యటించారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం.. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

LPG Gas Cylinder: ప్రజలకు సర్కార్ బంపరాఫర్.. గ్యాస్ ధరపై రూ.300 తగ్గింపు

‘‘రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వారికి కేవలం ఒక్క రూపాయికే పంటల బీమా ఇస్తున్నాం’’ అంటూ మంత్రి సత్తార్ పేర్కొన్నారు. మరోవైపు.. మార్చి 9న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం రైతులకు రూ. 6,000 సహాయంతో పాటు రూ. 1 పంట బీమా పథకాన్ని ప్రతిపాదించింది. అటు.. గత రెండు నెలలుగా పంట ధరలు పడిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఉల్లి రైతులకు, పెద్ద ఉపశమనంగా సీఎం ఏక్‌నాథ్ షిండే సోమవారం క్వింటాల్‌కు రూ. 300 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం రూ.500 నుంచి రూ.700 వరకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

Show comments