NTV Telugu Site icon

Farmers March: ఢిల్లీ మార్చ్‌కి సిద్ధమవుతున్న రైతులు..

Farmers March

Farmers March

Farmers March: మరోసారి రైతులు ఆందోళలనకు సిద్ధమవుతున్నారు. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లోని శంభు వద్ద హర్యానా ప్రభుత్వం రోడ్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి మార్చ్‌గా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లేదా రాంలీలా మైదాన్‌లో శాంతియుతంగా తమ నిరసన తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్ధూపూర్ ప్రెసిడెంట్ జగ్జీత్ సింగ్ దల్లెవాల్ తెలిపారు.

Read Also: BJP: అవార్డులు కావాలంటే సౌదీ వెళ్లండి.. మదర్సా విద్యార్థులపై బీజేపీ నేత..

పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతులకు ఫించన్లు వంటి డిమాండ్లతో మరోసారి ఆందోళన చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీకి మార్చ్ చేసేందుకు సిద్ధమైన తరుణంలో శంభు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి రోడ్డుని బ్లాక్ చేసి ఉంది. అయితే, ఇటీవల వీటిని తొలగించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశించింది. వీటి వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతోందని హైకోర్టు పేర్కొంది. శాంతిభద్రతల సమస్య అని పేర్కొంటూ హైకోర్టు తీర్పును హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

మరోసారి తమను అడ్డుకుని, రోడ్డును బ్లాక్ చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. మార్చిలో జరిగిన నిరసనల్లో నవదీప్ సింగ్ అనే రైతు నాయకుడు అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనికి సంఘీభావం తెలిపేందుకు రేపు, మరుసటి రోజు అంబాల వద్ద శాంతియుత నిరసన ప్లాన్ చేసినట్లు దల్లేవాల్ తెలిపారు. నవదీప్ సింగ్ హత్యాయత్నం సహా అల్లర్లను ప్రేరేపించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Show comments