దేశంలో అడ్డూ-అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలపై రైతు సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపనున్నారు రైతులు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘూ వద్ద సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. కాగా, రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రో ధరలు.. వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. డీజిల్ ధరలు పెరగడంతో.. ట్రాక్టర్ల కిరాయి పెరిగి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో సాగుకు రైతన్న వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పెట్రో మంట.. పోరాటానికి రైతన్నల రెడీ

Protest