కొందరు మూఢనమ్మకాలను బాగా నమ్ముతారు. అయితే వారిలో కొంతమంది లాజిక్కులతో పని లేకుండా మూఢ నమ్మకాలను గుడ్డిగా పాటిస్తుంటారు. ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. ఎవరో చెప్పిన మాట విని కరెంట్ షాక్‌తో చనిపోయిన యువకుడి బాడీని ఆవుపేడలో పాతిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానా సిర్సా జిల్లాలోని మండికలాన్ వలీ ప్రాంతంలో జగ్జీత్ సింగ్ అనే 32 ఏళ్ల యువకుడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కరెంట్ తీగపై తడి టవల్ ఆరేసే ప్రయత్నంలో అతడికి షాక్ కొట్టింది. దీంతో అతడిని కుటుంబసభ్యులు వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. యువకుడిని పరీక్షించిన డాక్టర్ అతడు చనిపోయాడని నిర్ధారించారు. కానీ ఆ విషయాన్ని కుటుంబసభ్యులు అంగీకరించలేదు.
Read Also: షారూఖ్ దీపావళి ప్రకటన వివాదం
కానీ వారికి ఎవరో ఓ ఉచిత సలహా ఇచ్చారు. చనిపోయిన వ్యక్తిని ఆరు నుంచి ఏడు గంటల పాటు ఆవుపేడలో పాతిపెడితే కరెంట్ షాక్ ప్రభావం తగ్గి బతుకుతాడని చెప్పారు. దీంతో జగ్జీత్ సింగ్ కుటుంబసభ్యులు ఆ సలహాను తూచా తప్పకుండా పాటించారు. తమకు సమీపంలోని ఓ రైతు ఇంట్లో ఉన్న ఆవుపేడలో యువకుడి బాడీని పాతిపెట్టారు. 6 గంటల తర్వాత బాడీలో చలనం వచ్చినట్లు అనిపించేసరికి వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ వైద్యులు మాత్రం మరోసారి పరీక్షించి యువకుడు చనిపోయి చాలాసేపు అయ్యిందని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు రోధించడంతో అక్కడున్న వారందరూ కంటతడి పెట్టుకున్నారు.