NTV Telugu Site icon

Canada: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా..

Canada

Canada

Family Members Of Indian Workers Now Eligible To Work In Canada: తీవ్ర కార్మికులు, ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతున్న కెనడా.. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా విదేశీయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కెనడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయులకు ఇది గుడ్ న్యూసే. భారతీయ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. వచ్చే ఏడాది నుంచి తాత్కాలిక వర్క్ పర్మిట్ తో కెనడాలో ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కెనడా ఇమ్మిగ్రేషన్, సిటిజన్ షిప్ మినిష్టర్ సీన్ ఫ్రేజర్ శుక్రవారం మాట్లాడుతూ.. విదేశీ కుటుంబ సభ్యులు ఈ విధానం కింద కెనడాలో పనిచేసుకోవచ్చని చెప్పారు.

Read Also: Elon Musk: వివాదాస్పద వ్యక్తులపై ఎలాన్ మస్క్ ట్విట్టర్ పోల్..

హై స్కిల్ లేబర్ గా పనిచేస్తున్న వ్యక్తుల భార్యలు, పనిచేసే వయస్సు వచ్చిన వారి పిల్లలు తాత్కాలికంగా పనిచేసుకునేందుకు అర్హత పొందవచ్చు. ఈ చర్య వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కార్మికుల శ్రేయస్సు మెరుగుపరచడమే లక్ష్యం అని ఆయన అన్నారు. జనవరి 2023 నుంచి తాత్కాలికంగా రెండేళ్ల పాటు జీవిత భాగస్వాములు, పనిచేసే వయసు కలిగిన వారి పిల్లలు ఉపాధి పొందే అవకాశం ఏర్పడింది.

ఈ కొత్త విధానం వల్ల సుమారుగా 2 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు కెనడాలో పనిచేసుకునే అవకాశం ఏర్పడింది. కెనడా అవసరాలను తీర్చడానికి విదేశీ కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. కార్మికులు, ఉద్యోగుల కొరత కారణంగానే కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కెనడాలో పర్యాటక రంగం తీవ్రంగా నిపుణులు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటోంది.

Show comments