Site icon NTV Telugu

Tamil Nadu: దారుణం.. అన్‌లైన్ రమ్మీ ఆటకు కుటుంబం బలి

Tamil Nadu

Tamil Nadu

తమిళనాడులో దారుణం జరిగింది. అన్‌లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Road Accident: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి!

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. భార్య, ఇద్దరి పిల్లలను చంపిన తర్వాత ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్‌లైన్ రమ్మీలో అప్పులు చేసి… ఆట ఆడినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో ప్రేమ్‌రాజ్ పేర్కొ్న్నాడు. ప్రేమ్‌రాజ్.. స్థానికంగా ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Chhava : తెలుగులో విడుదలకు అడ్డంకులు ఎదుర్కొంటున్న ‘ఛావా’..!

Exit mobile version